సెక్యూరిటీ గార్డుపై దాడి విషయం అడిగినందుకే అసత్య ఆరోపణలు
సెక్యూరిటీ గార్డు చరణ్ పై దాడి చేసినందుకు అతని ఫిర్యాదు మేరకు కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షులు సోమదేవేందర్ రెడ్డిని మార్కెట్ యార్డ్ కార్యదర్శి వెంకన్న ఆధ్వర్యంలో పిలిచి అడిగినందుకే మార్కెట్ యార్డ్ కు సంబంధం లేని విషయాలపై ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నాడని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు చైర్మన్ ఆర్.ఆనంద్ బాబు తెలిపారు.
దిశ, తిరుమలగిరి : సెక్యూరిటీ గార్డు చరణ్ పై దాడి చేసినందుకు అతని ఫిర్యాదు మేరకు కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షులు సోమదేవేందర్ రెడ్డిని మార్కెట్ యార్డ్ కార్యదర్శి వెంకన్న ఆధ్వర్యంలో పిలిచి అడిగినందుకే మార్కెట్ యార్డ్ కు సంబంధం లేని విషయాలపై ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నాడని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు చైర్మన్ ఆర్.ఆనంద్ బాబు తెలిపారు. శుక్రవారం చైర్మన్ చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ సామాన్య సెక్యూరిటీ గార్డుపై దాడి చేయడం ఏమిటి అని బాధితుల పక్షాన అడిగినందుకే ఆయన మార్కెట్ లోని కమిషన్ ఏజెంట్ లు అందరినీ రెచ్చగొట్టి రైతులకు నష్టం జరిగేలా నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ లో క్రయ విక్రయాల నిలుపుదలకు ఆయన వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
అదే విధంగా మార్కెట్ యార్డ్ లో జరుగుతున్న అక్రమాలను అవినీతిని వెలికి తీస్తున్నందుకే తమ పాలక మండలి పట్ల కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. మార్కెట్ యార్డ్ లో తాము నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంటే నిబంధనలు అతిక్రమించేవారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయమై మార్కెటింగ్ శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినట్లు తెలిపారు. బాధితుడు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు కార్యదర్శి వెంకన్న, వైస్ చైర్మన్ దేవెందర్, శరత్, రాజేందర్, సంతోష్, రాము, అమీర్, జూలిస్, అస్లాం పాల్గొన్నారు.
కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని నిరసన
బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దురుసుగా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ మార్కెట్ యార్డులోని కమీషన్ వ్యాపారస్తులు శుక్రవారం నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. గత కొన్నేళ్లుగా బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్లో వ్యాపారం నిర్వహిస్తున్న తమ పట్ల చైర్మన్ వైఖరి నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చైర్మన్ వైఖరిని ఖండిస్తూ ఉదయం 9 గంటల వరకు మార్కెట్ లో క్రయవిక్రయాలు నిలిపివేసినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కార్యాలయం ఎదుట శాంతియుత ప్రదర్శన చేపట్టారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో మార్కెట్ యార్డు బంద్ కు పిలుపు ఇస్తామని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సోమ దేవేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మిర్యాల శ్రీనివాస్, సదానంద్ పాల్గొన్నారు.