అక్రమ నిర్మాణాలపై కొరడా

మూసాపేట్​ సర్కిల్​ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై టౌన్​ ప్లానింగ్​ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.

Update: 2025-02-14 14:19 GMT
అక్రమ నిర్మాణాలపై కొరడా
  • whatsapp icon

దిశ, కూకట్​పల్లి : మూసాపేట్​ సర్కిల్​ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై టౌన్​ ప్లానింగ్​ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సర్కిల్​ పరిధిలో జీహెచ్​ఎంసీ నిబంధనలను బేఖాతరు చేస్తూ నిర్మిస్తున్న 5 భవనాలను శుక్రవారం టౌన్​ప్లానింగ్​ టీపీఎస్​ రమేష్​ ఆధ్వర్యంలో సీజ్​ చేశారు. సర్కిల్​ పరిధిలోని భగత్​సింగ్​నగర్​ కాలనీలో ప్లాట్​ నంబర్​ 1019లో నిర్మిస్తున్న భవనాన్ని, వసంత్​నగర్​ కాలనీలో ప్లాట్​ నంబర్​ 520, ప్లాట్​ నంబర్​ 710, ప్లాట్​ నంబర్​ 213 మొత్తం నాలుగు అక్రమ నిర్మాణాలను టౌన్​ప్లానింగ్​ అధికారులు సీజ్​ చేశారు. ఈ సందర్బంగా టీపీఎస్​ రమేష్​ మాట్లాడుతూ జోనల్​ కమిషనర్​ ఆదేశాల మేరకు సర్కిల్​ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్​ప్లానింగ్​ సిబ్బంది రమేష్​, శేఖర్​ తదితరులు పాల్గొన్నారు.  


Similar News