పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప వరం : మద్దుల లక్ష్మీ

పేద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి... Cheques distributed

Update: 2023-02-25 12:43 GMT

దిశ, మేడ్చల్ టౌన్: పేద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డ్ కు చెందిన జయకు 60 వేల రూపాయలు, శివకు 20 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి, హేమంత్ రెడ్డి, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News