బీఆర్ఎస్ మహాధర్నా...

కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల సిలిండర్ ధరను 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధరను 350 రూపాయల... BRS Protest at Boduppal

Update: 2023-03-02 09:51 GMT

దిశ, మేడిపల్లి: కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల సిలిండర్ ధరను 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధరను 350 రూపాయల మేర భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందని నిరసిస్తూ బోడుప్పల్లో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఆదేశాల మేరకు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు రూ. 1200 లకు చేరిందని, పెరుగుతున్న సిలిండర్ ధరలపైన ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలపై వ్యవహరిస్తున్న నిరంకుశ పాలనను ఎండగట్టాలని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు గురువారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బోడుప్పల్ లో ధర్నా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మంద సంజీవరెడ్డి, 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల మహిళలు మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News