పేదల అభ్యున్నతికి బీజేపీ కృషి

కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి, అంబేద్కర్ హాట్స్ బస్తీ ప్రజల సమస్యలు తీరాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2025-03-23 10:16 GMT

దిశ, తిరుమలగిరి : కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి, అంబేద్కర్ హాట్స్ బస్తీ ప్రజల సమస్యలు తీరాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డు అంబేద్కర్ హాట్స్ బస్తీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సాంబ అశోక్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ నేతృత్వంలో ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది కుటుంబాలు వివిధ ప్రాంతాలకు చెందిన వారు గత 40 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారని, అంగన్వాడీ కేంద్రం, బస్తీ దవాఖాన, శాశ్వత ఇంటి పట్టాలు రావాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు.

    బీజేపీ పేదల పక్షాన నిలబడి న్యాయం చేస్తుందని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా కార్మికులుగా, లేబర్లుగా, మున్సిపాలిటీలలో పనిచేస్తూ దుర్బరమైన జీవితం గడుపుతున్న అంబేద్కర్ హాట్స్ బస్తీ వాసుల కలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంటులో అంబేద్కర్ బస్తీవాసుల సమస్యలు లేవనెత్తి రక్షణశాఖ ద్వారా వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం భానుక నర్మద మాట్లాడుతూ 3వ వార్డు అంబేద్కర్ హాట్స్ బస్తీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బస్తీలో మురుగు కాలువల సమస్య, మంచినీటి కొరత, విద్యుత్ దీపాల ఏర్పాటు, మంచినీటి ట్యాంకర్ల నిర్మాణాల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి పరుశురాం, మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బీఎన్ శ్రీనివాస్, 1,2,3,6వ వార్డుల డివిజన్ అధ్యక్షులు అరుణ్, జైపాల్ రాకేష్, శ్రావణ్, ప్రతిక్ జైన్, అంబేద్కర్ హాట్స్ నాయకులు మల్లికార్జున్, రంగప్ప, మహేష్, నాగన్న, పరుశురాం, వెంకట్ రాములు, సుంకన్న, సూరి, చిరంజీవి తదితరులు బీజేపీలో చేరారు.

పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి

పద్మశాలీల సమస్యలు పరిష్కరించడానికి నిత్యం అందుబాటులో ఉంటానని ఎంపీ అన్నారు. శనివారం రాత్రి శోభ గార్డెన్ లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీని పద్మశాలీలు ఘనంగా సన్మానించారు. పద్మశాలీలకు కమ్యూనిటీ హాల్, రాజకీయాలలో సముచిత స్థానం కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. పద్మశాలీల సమస్యలు పరిష్కరించడానికి నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. ప్రజల కాలికి ముల్లు గుచ్చుకుంటే పన్నుతో తీసేవాడే నిజమైన లీడర్ అని, ఆ విధంగానే ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించడానికి కృషి చేస్తానని అన్నారు. మల్కాజ్ గిరి ప్రాంతంలో ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేని వారి సమస్యలు తన దృష్టికి తీసుకురావాలన్నారు.

    తనపై వారికి ఉన్న విశ్వసాన్ని వమ్ము చేయకుండా పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో రాజకీయ ఎదుగుదల కోసం పద్మశాలీలకు సముచిత స్థానం కల్పించే విధంగా చొరవ తీసుకుంటారని పేర్కొన్నారు. ఆదుకోవడానికి నిత్యం అందుబాటులో ఉంటానని, అదే విధంగా నిధులు సమకూర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో ఆయనకు పద్మశాలి కులబాంధవులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్, బీజేపీ నాయకులు మల్లికార్జున్, సంఘం సభ్యులు సత్యనారాయణ, సాంబయ్య, మల్లేష్, ప్రతాప్, అశోక్, తమ్మల నాగేందర్ పాల్గొన్నారు. 


Similar News