పీర్జాదిగూడ నూతన మేయర్‌గా అమర్ సింగ్ ప్రమాణస్వీకారం
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా
దిశ, మేడిపల్లి: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. గతంలో మేయర్ పై అవిశ్వాసం పెట్టి బలాన్ని నిరూపించుకుని ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు మేయర్ గా అమర్ సింగ్ ను ఎన్నుకోగా, పీర్జాదిగూడ నూతన మేయర్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు నూతన్ మేయర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై భారీ ర్యాలీగా ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.