ఆ... మూడు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓటేసింది మహిళలే
శాసనసభ సాధారణ ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన పోలింగ్ లో జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల పరిధిలో గజ్వేల్ మినహా, మిగిలిన మూడు నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: శాసనసభ సాధారణ ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన పోలింగ్ లో జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల పరిధిలో గజ్వేల్ మినహా, మిగిలిన మూడు నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని 1151 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 9,48,664 మంది ఓటర్లకు గానూ 7,87,871 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 1,60,758 మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. పురుషులు 4,68,422 మంది ఓటర్లకు 3,92,014 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 76,408 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 4,80,166 మంది ఓటర్లు ఉండగా 3,95,816 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 84,350 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. జిల్లాలో ఇతరులు 41 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల పరధిలో అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో ఓటింగ్ శాతం నమోదు కాగా, సిద్దిపేట నియోజక వర్గంలో తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది.
సిద్దిపేట నియోజక వర్గంలో...
సిద్దిపేట నియోజక వర్గంలో 2,33,733 మంది ఓటర్లు ఉండగా 1,78,420 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 1,15. 346 మందికి 88,673 మంది, మహిళాలు 1,18,317 మందికి 89,710 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరులు 70 మందికి గానూ 37 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గజ్వేల్ నియోజక వర్గంలో...
గజ్వేల్ నియోజక వర్గంలో 2,74,654 మంది ఓటర్లు ఉండగా 2,31, 086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 1,36,294 మందికి 1,15,892 మంది, మహిళలు 1,38,353 మందికి 1,15,191 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హుస్నాబాద్ నియోజక వర్గంలో...
హుస్నాబాద్ నియోజక వర్గంలో 2,42,177 మంది ఓటర్లకు గానూ 2,04,999 ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 1,19,761 మందికి 1,01,898 మంది, మహిళలు 1,22,412 మందికి 1,03,100 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దుబ్బాక నియోజక వర్గంలో...
దుబ్బాక నియోజక వర్గంలో 1,98,100 మంది ఓటర్లకు గానూ 1,73,366 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 97,019 మందికి 85,551 మంది, మహిళలు 1,01,081 మందికి 87,815 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని 4 నియోజక వర్గాల్లో 95 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వారి భవితవ్యం ప్రస్తుతం ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తమై ఇందూరు ఇంజనీరింగ్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్ లకు చేరింది. డిసెంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపుతో విజేతలెవరో తేలనుంది.