మహిళలకు రక్షణ కరువైంది
మహిళలకు రక్షణ కరువైందని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : మహిళలకు రక్షణ కరువైందని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కొన్ని సంఘటనల్లో బీజేపీ ఎంపీలు నిందితులుగా ఉన్న సమర్థించడం దారుణమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సాధారణ ఎన్నికల్లో అవకాశం కల్పించకపోవడం మహిళలను మోసగించడమే అన్నారు. ఓట్లు దండుకోవడానికే బిల్లుకు ఆమోదం తెలిపారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రంగాల్లో మహిళలకు సగభాగం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజు కుమార్, స్నేహ ఇంటి పని వారిలా సంఘం అధ్యక్షురాలు దండు లక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు.