బీఆర్ఎస్ కు వెల్దుర్తి ఎంపీపీ గుడ్ బాయ్
నర్సాపూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి నాయకులు ఫిరాయిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
దిశ,వెల్దుర్తి: నర్సాపూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి నాయకులు ఫిరాయిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరున్న బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, ఆయన సతీమణి వెల్దుర్తి ఎంపీపీ స్వరూపరెడ్డిలు శనివారం కాంగ్రెస్ నాయకుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో, కాంగ్రెస్ నర్సాపూర్ అసెంబ్లీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మండలంలో బలమైన నాయకుడిగా ఎదిగిన నరేందర్ రెడ్డి, ఎంపీపీ ఒక్కసారిగా పార్టీ ఫిరాయించడంతో మండలంలో హార్ట్ టాపిక్ గా మారింది. ఆయన వెంట మెదక్ పాడి పరిశ్రమ సహకార సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు శెట్టిపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరికొంతమంది పార్టీ నాయకులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. తమప్రజా నాయకుడు, నిస్వార్ధపడు సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతోనే మనస్తాపం చెంది ఎంపీపీ తోపాటు పలువురు పార్టీ మారినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.