సన్న బియ్యం పేరిట 40 శాతం నూకలు ఇస్తుండ్రు : హరీష్ రావు

నూకలు తినండి అన్న కేంద్ర మంత్రి పియుష్ గొయల్ నాటి

Update: 2025-04-12 15:23 GMT
సన్న బియ్యం పేరిట 40 శాతం నూకలు ఇస్తుండ్రు : హరీష్ రావు
  • whatsapp icon

దిశ, సిద్దిపేట ప్రతినిధి : నూకలు తినండి అన్న కేంద్ర మంత్రి పియుష్ గొయల్ నాటి మాటలను.. నేడు సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పేరుతో 40 శాతం నూకలు ఇచ్చి ప్రజలకు తినిపిస్తున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభ పురస్కరించుకొని సిద్దిపేట పట్టణ, చిన్నకోడూరు మండల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా గుడు కట్టుకుంది... మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ కావాలి రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి ఎంత స్పీడ్ గా వచ్చిందో.. ఎన్నికల తర్వాత ఎగవేతల తో అంతే స్పీడ్ గా పడి పోయిందన్నారు.

నాది యంగ్ ఇండియా బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రేవంత్ రెడ్డి ఓట్ ఫర్ నోట్ కు, బూతులు మాట్లాడటం, లగ చెర్ల రైతులను జైల్లో పెట్టడం, హైడ్రాతో ఇట్లు కూల్చడం, అడవులను నరికి వేయడంలో బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంత ఆగం.. ఆగం.. సగం సగం అన్నారు. నాడు నొ ఎల్ ఆర్ ఎస్.. నొ బి ఆర్ ఎస్ అని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు మాట్లాడారు.. నేడు ఎల్ ఆర్ ఎస్ ను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గం పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్య కట్టినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. 27న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన బీఆర్ ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, నాయకులు కడవేర్గు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, గుండు భూపేష్, కొండం సంపత్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Similar News