విద్యా సంవత్సరం ముగిసేలోపే పనులు పూర్తి చేయాలి : కలెక్టర్

మన ఊరు.. మన బడి పథకంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండటం పై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అసహనం వ్యక్తం చేశారు.

Update: 2023-04-13 11:33 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మన ఊరు.. మన బడి పథకంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండటం పై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అసహనం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో దుబ్బాక నియోజక వర్గంలో మన ఊరు.. మన బడి పథకంలో చేపట్టిన పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపు పనులు పూర్తి చేయ్యాలన్నారు. హబ్సీపూర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఈజీఎస్ పనుల జనరేట్ చేసిన ఎస్టిమేట్ వివరాలను అందించాలని డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్ రెడ్డికి సూచించారు. మరుసటి సమావేశం నాటికి పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ పైజాన్ ఆహ్మద్, డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఎంఈవో, ఎంపీడీవో, ఎంపీవోలు, నిర్మాణ సంస్థల ఏజెన్సీల ప్రతినిధులు, సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News