ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్యాంపు కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Update: 2024-08-17 07:27 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్యాంపు కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు క్యాంపు కార్యాలయం లోకి దూసుకెళ్లేందుకుప్రయత్నించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. హరీష్ రావు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags:    

Similar News