నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి దే

నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీత రెడ్డిని విజయం వరించింది. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మెదక్లో ఆదివారం నిర్వహించారు.

Update: 2023-12-03 15:32 GMT

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీత రెడ్డిని విజయం వరించింది. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మెదక్లో ఆదివారం నిర్వహించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి నువ్వా నేనా అన్నట్టుగా నరాలు తెగే ఉత్కంఠతతో సాగింది. చివరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి పై 9147 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నర్సాపూర్ నియోజవర్గం నుంచి మొత్తం ఓట్లు 2,23,593 ఉండగా ఇందులో 1,96,841 పోలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డికి 8,81,04 రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి 7,89,57 ఓట్లు వచ్చాయి. బీజేపీ పార్టీ అభ్యర్థి మురళి యాదవ్ కు 22,713 ఓట్లు వచ్చాయి. కాగా 9147 ఓట్ల తేడాతో సునీత లక్ష్మారెడ్డి గెలుపొందారు. 14 టేబుల్ 22 రౌండ్లు ఓట్ల లెక్కింపు కోసం 14 టెబుల్లో 22 రౌండ్లలో లెక్కింపు జరిపారు. రెండు నుంచి 8 రౌండ్లతో పాటు 19 వ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించగా మిగతా అన్ని రౌండ్లలో బీఆర్ఎస్ పార్టీ సునీత లక్ష్మారెడ్డి ఆదిపత్యం ప్రదర్శించారు. ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రం అందుకున్న సునిత లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కౌంటింగ్ కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి వచ్చి ఎమ్మెల్యే నియామక పత్రాన్ని నర్సాపూర్ ఆర్వో శ్రీనివాసులు ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

నాలుగోసారి ఎమ్మెల్యేగా సునీత లక్ష్మారెడ్డి విజయం సాధించినట్లు తెలుసుకొని వందలాదిగా కార్యకర్తలు పెద్దసంఖ్యలో కౌంటింగ్ కేంద్ర వద్దకు తరలివచ్చి పెద్దఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ, సునీత లక్ష్మారెడ్డి జిందాబాద్, జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సునీత లక్ష్మారెడ్డి భర్త శివంపేట జడ్పీటీసీ లక్ష్మారెడ్డి మరణానంతరం గృహిణిగా ఉన్న సునీత రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సునీత లక్ష్మారెడ్డి సీపీఐ అభ్యర్థి విట్టల్ రెడ్డి పై గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009 లో వరుసగా విజయం సాధించి ఉమ్మడి రాష్ట్రస్థాయిలో మంత్రి పదవులు చేపట్టారు. అనంతరం 2014, 2018 ఎన్నికల్లో మదన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2019 లో బీఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియామకమయ్యారు. 2023లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడి రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ వే ఉన్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి పై గెలుపొందారు.

Tags:    

Similar News