జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మద్దూర్ మండలం నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ.. జాతీయ చైర్మన్ డా"మహమ్మద్ యాసీన్ నియామక పత్రాన్ని అందుకున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Update: 2023-09-19 14:27 GMT
జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి
  • whatsapp icon

దిశ, చేర్యాల: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మద్దూర్ మండలం నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ.. జాతీయ చైర్మన్ డా"మహమ్మద్ యాసీన్ నియామక పత్రాన్ని అందుకున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..సంస్థలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ అహర్నిశలుగా కృషి చేస్తున్న నన్ను గుర్తించి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు. జిల్లా, మండల కమిటీల నాయకులతో త్వరలోనే రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డికి పలువురు నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చారగొండ రమేష్ రెడ్డి, ప్రచార కార్యదర్శులు ఎలకంటి రాజు, యాసారపు కర్ణాకర్ లు, ములుగు జిల్లా అధ్యక్షుడు పాలతీయ రాజ్ శేఖర్ నాయక్, బచ్చనపేట మండల అధ్యక్షులు ఇజ్జగిరి శేఖర్, తదితరులు ఉన్నారు.


Similar News