వైభవంగా శ్రీ రామ శిల శోభాయాత్ర...

శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తా పీఎస్ఆర్ గార్డెన్ వద్ద నుంచి ఆదివారం శ్రీరామ శిల శోభాయాత్ర ప్రారంభమైంది.

Update: 2024-06-16 14:24 GMT

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తా పీఎస్ఆర్ గార్డెన్ వద్ద నుంచి ఆదివారం శ్రీరామ శిల శోభాయాత్ర ప్రారంభమైంది. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రత్యేక పూజలు చేసి శిల యాత్ర ప్రారంభించారు. వివిధ రకాల వాయిద్య కళాకారులు తమ వాయిద్యాలను వాయిస్తూ ముందుకు కదిలారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8 వేల మంది వివిధ సాంప్రదాయాల కీర్తనలు, భజనలు, నృత్యాలు, అభినయాలు జెండా ప్రదర్శనల ద్వారా యాత్ర కొనసాగింది. మహారాష్ట్ర వార్ఖరి భజన బృందం పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. వెయ్యి మంది మహిళలు కలశాలను మోస్తూ ముందుకు కదిలారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఫసల్వాదిలోని విద్యాపీఠం వరకు శోభాయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సభ్యుడు తోపాజి అనంత కృష్ణ, ప్రశాంత్ కుమార్, విద్యాసాగర్, మహిళలు, భక్తులు పాల్గొని శ్రీ రామచంద్ర మూర్తి దీవెనలు, ఆశీర్వాదాలు పొందారు.


Similar News