కాంగ్రెస్ వల్లే ప్రత్యేక తెలంగాణ సాకారం

దుబ్బాక టికెట్ అధిష్టానమే నిర్ణయిస్తుందని అందుకు పార్టీ నాయకులు కట్టుబడి ఉండాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక సభ్యుడు దాద్రా నగర్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ శర్మ అన్నారు.

Update: 2023-09-19 10:02 GMT

దిశ, దుబ్బాక: దుబ్బాక టికెట్ అధిష్టానమే నిర్ణయిస్తుందని అందుకు పార్టీ నాయకులు కట్టుబడి ఉండాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక సభ్యుడు దాద్రా నగర్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ శర్మ అన్నారు. సోమవారం దుబ్బాక నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటిలో ఉన్న ముగ్గురు నాయకులను ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉందో తెలుసుకోవడానికి విచ్చేసిన సీడబ్ల్యూసీ ప్రత్యేక సభ్యుడు దాద్రా నగర్ పీసీసీ అధ్యక్షులు మహేష్ శర్మకు దుబ్బాక మండలం హబ్షీపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ మెంబర్ కత్తి కార్తీక గౌడ్ పార్టీ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.15 వేలు, రూ.12 వేలు ఆర్థికసాయం అందిస్తామన్నారు. పట్టాదారు రైతులకు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీ లకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తామని ఆయన విజయభేరీ సభ ద్వారా ప్రకటించారన్నారు. వరికి కనీస మద్దతు ధర చెల్లించడంతోపాటు అదనంగా రూ.500 బోనస్ కూడా ఇస్తామని, మిగులు రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందేనని, రెండు పార్టీల నడుమ స్పష్టమైన లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు.

దేశానికి స్వాత్రంత్యం కాంగ్రెస్ తీసుకువచ్చిందని, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆరు అంశాలపై డిక్లరేషన్ చేసిందని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోరకు దుబ్బాక లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న ముగ్గురిలో ఎక్కువ మెజారిటీ ఉన్న వారికి టికెట్ విషయంలో మేము ఇచ్చే సర్వే పై అధిష్టానం టికెట్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తుందన్నారు. టికెట్ ఇచ్చిన వారికి మిగతా నాయకులు సహకరించి దుబ్బాక లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెల రూ. 2500, గ్యాస్ సిలిండర్ రూ. 500 లకే, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువ వికాసం పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్య భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, చేయూత పథకం కింద నెలవారీ పింఛన్ రూ. 4000 రాజీవ్ ఆరోగ్య భీమా కింద రూ.10 లక్షల భీమా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు, ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం ఇస్తుందన్నారు.

నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకుని తిరిగే నైజం కాంగ్రెస్‌ది కాదని, కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసి చూపిస్తుందని, ఇందుకు ఉదాహరణే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నల శ్రీనివాస్ రావు, బిజ్జ భూపాల్ గౌడ్, శేఖర్, శ్రీనివాస్, సాయి చరణ్ గౌడ్, బొడ్డు రాజు, డప్పు రాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News