సైన్స్‌తోనే సమాజ పురోగతి
సైన్స్‌తోనే సమాజ పురోగతి సాధ్యమవుతుందని మనకు కావలసిన కొత్త పరిజ్ఞానాన్ని స్సృష్టించడంతో పాటు జీవన నాణ్యతను పెంచుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.
దిశ, పటాన్ చెరు: సైన్స్‌తోనే సమాజ పురోగతి సాధ్యమవుతుందని మనకు కావలసిన కొత్త పరిజ్ఞానాన్ని స్సృష్టించడంతో పాటు జీవన నాణ్యతను పెంచుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లోని శ్రీ వైష్ణవి హై స్కూల్‌లో సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సైన్స్ ప్రమేయం లేకుండా ఈ విశాల విశ్వంలో ఏదీ లేదన్నారు. ఏ విషయం తీసుకున్నా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అది సైన్స్‌తో సంబంధం ఉంటుందన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణకు రూపం దాల్చే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, బురి గారి అంజి రెడ్డి, సొసైటీ డైరెక్టర్ పెంటయ్య, రవి, రాఘవేంద్ర, మణికంఠ,రాజు, తన్వీర్, రహీమ్, అంతయ్య, నవీన్, విద్యార్థులు,తల్లిదండ్రులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.