విద్యుత్ సరఫరాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం : Narsapur MLA Chilumula Madan Reddy
రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు.
దిశ, వెల్దుర్తి : రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. బుధవారం వెల్దుర్తి లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడి హోదాలోఉండి మూడు గంటల విద్యుత్ సరఫరా చాలు అనడం రైతులను అవమానించడమే అని అన్నారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 38 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. 30 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా చర్లపల్లి, రామయపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ రమేష్ గౌడ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఎంపీటీసీలు మోహన్ రెడ్డి బాబు, సర్పంచ్ లు రామకృష్ణారావు, లత, నారాయణ, మల్లేశం గౌడ్, శంకర్ రెడ్డి, నారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, ఆముద ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, తోట నర్సింహులు, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు .
Read More: కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ: Minister Mallareddy