Collector Manoj Chaudhary : స్వచ్ఛత అందరి బాధ్యత..
స్వచ్ఛత మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి అన్నారు.
దిశ, వర్గల్ : స్వచ్ఛత మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి అన్నారు. శుక్రవారం వర్గల్ మండలంలోని గౌరారంలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే కళాశాల విద్యార్థులతో కలిసి ఆయన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్నారు. స్వచ్ఛదనం వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు.
మొక్కల నాటి వాడిని సంరక్షించే బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. తాగునీటి కలుషితం వల్ల వివిధ రకాలైన వ్యాధులు వస్తాయని అన్నారు. ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ రావు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.