కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు ప్రధాన కాలువలు నిర్మించాం : దుబ్బాక ఎమ్మెల్యే
కేసీఆర్ పాలనలో తాము ప్రాజెక్టులు ప్రధాన కాలువలు నిర్మిస్తే కాంగ్రెస్
దిశ,దుబ్బాక : కేసీఆర్ పాలనలో తాము ప్రాజెక్టులు ప్రధాన కాలువలు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువలు కూడా నిర్మించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని పెద్ద గుండవెల్లి గ్రామంలో ప్రధాన ఉప కాలువలను అధికారులు, రైతులతో కలిసి సాగునీటి వ్యవస్థ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు...దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు మూలంగా తాము సర్వం కోల్పోయామని, మా కడుపు నింపిన తర్వాతే బయటకు నీళ్లు తీసుకెళ్లాలని, లేని పక్షం లో మల్లన్న సాగర్ వద్ద గోదావరి జలాలను హైదరాబాద్ కు వెళ్లే మల్లన్న సాగర్ జలాలను అడ్డుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఏడాది కాలంగా కాలువలు నిర్మించి నీళ్లు అందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.మల్లన్న సాగర్ నిర్మాణం మూలంగా తమ గ్రామాలు కోల్పోవడం తో పాటు రోడ్లు దెబ్బతిన్నాయన్నారు.తమ దగ్గర వెంటనే కాలువలు పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని లేని పక్షంలో హైదరాబాద్ వెళ్లే మల్లన్న సాగర్ నీళ్లను అడ్డుకుంటామన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వని పక్షం లో తెలంగాణ ఉద్యమం తరహా మరో ఉద్యమం నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.పెద్దగుండ వెల్లి పరిసర గ్రామాలకు ఎల్లారెడ్డి పేట నుంచి ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు.సన్నబియ్యం కార్యక్రమం అంటూ కొబ్బరికాయలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులకు రైతుల బాధలు పట్టవా అని విమర్శించారు.తాము అధికారంలోకి వొస్తే వెంటనే కాలువలు పూర్తి చేసే వారమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.