రాజకీయ పార్టీలు సహకరించాలి

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పార్లమెంట్ ఎన్నికల విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-03-07 13:49 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పార్లమెంట్ ఎన్నికల విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిధిలో సహాయక కేంద్రం ఏర్పాటు, లొకేషన్ చేంజ్ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎలక్షన్స్ సూపరింటెండెంట్ మధుసూదన్, ఎలక్షన్ డీటీ శ్రీనివాస్, బీజేపీ ప్రతినిధి విధీషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి మోహన్ లాల్, ఎంఐఎం ప్రతినిధి మునీరుద్దీన్, ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News