PRC : పెండింగ్ డీఏలు మంజూరు చేసి పీఆర్సీ ప్రకటించాలి..

బకాయి పడిన కరువు భత్యం మంజూరు చేసి, 50 శాతం ఫిట్మెంట్ తో వెంటనే వేతన సవరణ చేయాలని పీఆర్టీయూ టీఎస్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లుగారి ఇంద్రసేనారెడ్డి కోరారు.

Update: 2024-08-09 14:35 GMT

దిశ, నంగునూరు : బకాయి పడిన కరువు భత్యం మంజూరు చేసి, 50 శాతం ఫిట్మెంట్ తో వెంటనే వేతన సవరణ చేయాలని పీఆర్టీయూ టీఎస్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లుగారి ఇంద్రసేనారెడ్డి కోరారు. శుక్రవారం మండల పరిధిలోని ముండ్రాయి, వెంకటాపూర్, తిమ్మాయపల్లి, నర్మెట, అంక్షాపూర్, ఖానాపూర్, ఖాత, గట్ల మల్యాల, అక్కెనపల్లి, నంగునూరు గ్రామాల్లోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఏకీకృత సేవా నిబంధనలు తీసుకొచ్చి జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, డైట్ కాలేజీ లెక్చరర్, ఎంఈవో, జిల్లా ఉపవిద్యాధికారి పోస్టులను ఉపాధ్యాయుల పదోన్నతులతో నింపాలని కోరారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత ఫించను వర్తింపజేయాలని, మానిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనిగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరికి పాత ఫించను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 11, 12 సవరించి బీఈడీ అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పీఎస్హెచ్ఎం పదోన్నతి కల్పించాలని కోరారు.

పదివేల పీఎస్హెచ్ఎం పోస్టులు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల వివిధ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే బకాయి పడిన నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులను నియమించేందుకు అనుమతులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కొత్తపల్లి రవి, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎర్ర పార్థసారథి, పంతం నరేష్, పీఆర్టీయూ నాయకులు భూపతి రెడ్డి, రామస్వామి, రామరాజు, కన్యాలాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News