కోవాలెంట్ లాబరేటరీస్ పరిశ్రమలో ఒకరు మృతి

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూర్ గ్రామ శివారులో కోవాలెంట్ లాబరేటరీస్ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-03-06 14:06 GMT

దిశ, హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూర్ గ్రామ శివారులో కోవాలెంట్ లాబరేటరీస్ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. రెండో షిఫ్ట్ డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో వినోద్ కుమార్ అదే సమయంలో పరిశ్రమలోని ప్రొడక్షన్ బి బ్లాక్ -4లోని ఏఎన్‌ఎఫ్‌డీ నుండి కెమికల్ ముడి పదార్థాలను అన్లోడ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు రాగా రియాక్టర్ పేల్పోవడంతో వినోద్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని గుట్టుచప్పుడు కాకుండా యజమాన్యం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వినోద్ కుమార్ మృతి చెందాడు. అయినప్పటికీ యాజమాన్యం వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు గాయాలైనట్లు తెల్లవారిన తర్వాత సమాచారం ఇచ్చారు.

అక్కడికి వెళ్లిన తర్వాత వినోద్ కుమార్ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో పరిశ్రమ ముందు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై తమ కుటుంబానికి న్యాయం చేయాలని మరోసారి ధర్నా చేశారు. మృత్యునికి భార్య వీరమ్మ ఆరు నెలల బాబు ఉన్నారు. తమకు దిక్కే వారంటూ భార్య రోదన అక్కడ ఉన్న వారందరిని కంటతడి పెట్టించింది. అయినప్పటికీ యాజమాన్యం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

ఇతర రాష్ట్రాల వారికి ఇతర రాష్ట్రానికి ఎలాంటి సమాచారం ఉండదు

ఇతర రాష్ట్రాల వారు కార్మికులు పరిశ్రమలు మృతి చెందుతే కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్ నుంచి వారి స్వగ్రామానికి నేరుగా తరలించి నామమాత్రంగా డబ్బులు ముట్ట చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఈ పరిశ్రమలో ఎన్నో సంఘటన జరిగినప్పటికీ అవి వెలుగులోకి రావడం లేదు.


Similar News