ఎడారిలో ఉన్న నారాయణఖేడ్ ను సస్యాశ్యామలం చేశాం : CM KCR

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న, నారాయణఖేడ్ గతంలో ఎడారిగా ఉండేదని, తాము అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి సస్యాశ్యామలంగా చేశామని సీఎం కేసీఆర్ అన్నారు.

Update: 2023-10-30 14:49 GMT

దిశ, నారాయణఖేడ్: కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న, నారాయణఖేడ్ గతంలో ఎడారిగా ఉండేదని, తాము అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి సస్యాశ్యామలంగా చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని రైమాన్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. 60 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్‌లో అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ హాయంలోనే నారాయణఖేడ్ అభివృద్ధి జరిగిందన్నారు. నేను మంత్రిగా ఉన్న సమయంలో రేకుల గుడిసెలు ఉండేవని, ఇప్పుడు నారాయణాఖేడ్ బిల్డింగులు భవనాలు ఉన్నాయన్నారు. బసవేశ్వర సంగమేశ్వరన్ ఎత్తిపోతల పథకంకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మంజీరాకు లింకు చేసుకోవడంతో నిరంతరం నారాయణాఖేడ్, జహీరాబాద్ లకు నీరు ఉంటాయన్నారు. దీంతో రెండు నియోజకవర్గంలో నీరు ఉపయోగపడుతుందన్నారు.

నారాయణాఖేడ్‌లో 150 పడకల ఆసుపత్రిని నిర్మించామని, కల్లేరు, కర్చు గుత్తిలో 50 పడకల ఆసుపత్రిని నిర్మించామన్నారు. ఎమ్మెల్యే కోరిన మేరకు నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్, మాసన్ పల్లి రోడ్డు, 4 బీసీ హాస్టల్ లను అధికారంలోకి వచ్చిన వెంటనే మంజూరు చేస్తామన్నారు. నారాయణఖేడ్ డివిజన్ నూటికి 100 శాతం అభివృద్ధి జరిగిందన్నారు. చేతకాని కాంగ్రెస్ దద్దమ్మలు కత్తితో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి చేశారని, మా నాయకులు మొండి కత్తితో కార్యకర్తలను చంపే దమ్ము ఉందా అన్నారు. నారాయణఖేడ్ సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రభుత్వం 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ చెప్పడం సిగ్గుచేటని ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు.


60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏమి అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ అధికారం వచ్చినప్పటి నుంచి 100 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి తారు రోడ్డు వేయడం జరిగిందన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచుతామన్నారు. బీఆర్ఎస్ రాకముందు నారాయణఖేడ్ నియోజకవర్గంలో తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు, ఇంటింటికి మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామన్నారు. ఉప ఎన్నిక నుంచి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడుతున్న హీరో భూపాల్ రెడ్డి అని కొనియాడారు. పెద్ద శంకరంపేట రేగోడును సంగారెడ్డి జిల్లాలో కలుపుతామన్నారు. రూ. 800 కోట్ల నల్లవాగు ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. రూ. 100 కోట్లతో సిర్గాపూర్, మాసంపల్లి వరకు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నూతనంగా 100 పంచాయతీలను ఏర్పాటు, సిర్గాపూర్, మాసంపల్లి రోడ్డు మంజూరు చేయాలన్నారు. పెద్ద శంకరంపేట, రేగోడు మండలాలను సంగారెడ్డిలో కలపాలన్నారు. నాలుగు బీసీ గురుకులాలను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ గుంత రామ్మోహన్, ఫైనాన్స్ చైర్మన్ భూపాల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి, చైర్మన్ బిక్షపతి, మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగం నజీబ్, జెడ్పీపీటీసీలు, ఎంపీపీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఏపూరి సోమన్న ధూమ్ ధామ్ కార్యక్రమం ఆకట్టుకుంది.

Tags:    

Similar News