రోడ్డు పై నీటి గుంతను పరిశీలించిన ఎమ్మెల్యే..

మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారి పై పొతం శెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి నుండి సంగారెడ్డి వైపు వెళ్లే రోడ్డు మీద గుంత ఏర్పడడంతో గుంతలో నీరు నిలిచి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Update: 2024-09-29 13:41 GMT

దిశ, కొల్చారం : మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారి పై పొతం శెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి నుండి సంగారెడ్డి వైపు వెళ్లే రోడ్డు మీద గుంత ఏర్పడడంతో గుంతలో నీరు నిలిచి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆదివారం సాయంత్రం రోడ్డు పై ఏర్పడిన నీటి గుంతను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వారు పడుతున్న బాధల్ని తెలుసుకున్నారు. ద్విచక్ర వాహనాల పై ప్రయాణిస్తున్న వారు గుంతలో పడి ప్రమాదాల బారిన పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వర్షాలు పడిన సమయంలో సమీపంలో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుందని తెలిపారు.

దీంతో ఇంట్లో వస్తువులు చెడిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమీప ఇండ్లకు చెందిన గ్రామస్తులు తెలిపారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఆర్ఎంపీ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే రోడ్డు పై నీరు నిలవకుండా ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు యాద గౌడ్ యాదయ్య, నెల్లి కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ సీనియర్ నాయకులు ముత్యం గారి సంతోష్, సోమ నర్సింలు ఏడుపాయల మాజీ డైరెక్టర్ లు బాగా రెడ్డి, పొతంశెట్టిపల్లి గౌడ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News