రూ. 150 కోట్లు వాపసు ఇవ్వాలన్న కేంద్రం జీవో మీ దగ్గర ఉందా..? ఎందుకు అట్లా బురుద జల్లుతున్నారు?

రైతులు నిర్మించిన కల్లాల విషయంలో 150 కోట్ల రూపాయల డబ్బులను వాపస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం...MLA Raghunandhan Rao Serious Comments On MLC Farooq Hussain

Update: 2022-12-24 12:34 GMT

దిశ, చేగుంట: రైతులు నిర్మించిన కల్లాల విషయంలో 150 కోట్ల రూపాయల డబ్బులను వాపస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లుగా పేర్కొన్న జీవో మీ దగ్గర ఏదైనా ఉందా అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శాసన మండలి సభ్యులు ఫారూఖ్ హుస్సేన్ ను ప్రశ్నించారు. చేగుంట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 66 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శాసనమండలి సభ్యుడు ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ కల్లాల డబ్బుల వాపసు విషయంలో ధర్నాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేస్తూ గ్రామాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ఆలోచనలు మానుకోవాలని, కల్లాల నిర్మాణ విషయంలో ఏదైనా వాపస్ జీవో మీ దగ్గర ఉంటే ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 4000 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి 20 లక్షల రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం, తహశీల్దార్ లక్ష్మణ బాబు, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ తోపాటు నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News