బైక్ దొంగిలించిన వ్యక్తికి ఎనమిది నెలల జైలు

బైక్ దొంగిలించిన వ్యక్తికి మెదక్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయాధిపతి ఎనమిది నెలల సాధారణ జైలు శిక్ష విధించించారని ఎస్సై సందీప్ రెడ్డి తెలిపారు.

Update: 2023-04-26 14:45 GMT

దిశ , మనోహరాబాద్: బైక్ దొంగిలించిన వ్యక్తికి మెదక్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయాధిపతి ఎనమిది నెలల సాధారణ జైలు శిక్ష విధించించారని ఎస్సై సందీప్ రెడ్డి తెలిపారు. 2022, ఆగస్టులో మండల కేంద్రమైన మనోహరాబాద్ లో కర్నూలు జిల్లాకు చెందిన షికారి అర్జున్ అనే వ్యక్తి బైక్ ను దొంగిలించాడు. బుధవారం మెదక్ కోర్టులో నేరం రుజువైనందున న్యాయాధిపతి శ్రీమతి రిట లాల్చంద్ ముద్దాయి షికారి అర్జున్ కు ఎనమిది నెలల సాధారణ జైలు శిక్షను విధించారు. ముద్దాయికి శిక్ష పడటంలో కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్ మహిపాల్ రెడ్డిని అభినందించామని ఎస్సై సందీప్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News