వైభవంగా సుందరకాండ మహాయజ్ఞం

ఝరాసంగం మండల పరిధిలోని ఇస్లాంపూర్ గ్రామంలో వెలసిన వీర హనుమాన్ దేవాలయంలో సోమవారం భజన మండలి ఆధ్వర్యంలో సుందరకాండ మహాయజ్ఞం చేపట్టారు.

Update: 2023-04-03 16:36 GMT

దిశ, ఝరాసంగం: ఝరాసంగం మండల పరిధిలోని ఇస్లాంపూర్ గ్రామంలో వెలసిన వీర హనుమాన్ దేవాలయంలో సోమవారం భజన మండలి ఆధ్వర్యంలో సుందరకాండ మహాయజ్ఞం చేపట్టారు. గురుపూజతో మొదలై గణపతి పూజ, పుణ్యాహ వచనం, రుత్విక్ వరణం, మంటపారాధన, అఖండ దీపారాధన అనంతరం యాగశాల ప్రవేశం అత్యంత భక్తిశ్రద్ధలతో వేద మంత్రోచ్ఛారణలు, సన్నాయి మేళాల నడుమ కార్యక్రమాలు కొనసాగాయి.

సుందరకాండ యజ్ఞం హవనాదులు మధ్య సుందరకాండ యజ్ఞ పూర్ణాహుతి, మహా మంగళహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహాయజ్ఞం మరో రెండు రోజుల పాటు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. వివిధ రకాల పువ్వులతో మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. జిల్లాలో ప్రథమంగా చేపట్టిన సుంద‌ర‌కాండ మహా యజ్ఞం ఎంతో ప్రత్యేకమని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News