ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి
ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ ఎస్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధర్నా నిర్వహించి, ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అధికారంలో రాకముందు గ్రామ పంచాయతీ లేవుట్లను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి నేడు ఎల్ఆర్ఎస్ కట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలన్నారు. గ్రామ పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ అత్యుత్సాహంతో ప్లాట్లు హద్దురాళ్లను తొలగిస్తుడటంతో వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిరాం, లక్ష్మణ్, తిరుమల్ రెడ్డి, మొయిన్ తదితరులు పాల్గొన్నారు.