గణపతి చెక్కర ఫ్యాకర్టీ లాక్ డౌన్ ఎత్తివేయాలి.. MLA Jagga Reddy హెచ్చరిక

దిశ ప్రతినిధి, సంగారెడ్డి : గణపతి షుగర్ ఫ్యాక్టరీ తక్షణమే లాక్ డౌన్ ఎత్తివేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. లాక్ డౌన్ తో ఉపాది లేక ఆత్మహత్య చేసుకున్న కార్మికుడి

Update: 2022-09-09 11:17 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి : గణపతి షుగర్ ఫ్యాక్టరీ తక్షణమే లాక్ డౌన్ ఎత్తివేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. లాక్ డౌన్ తో ఉపాది లేక ఆత్మహత్య చేసుకున్న కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్‌లో 3 నెలల వేతనాలు వెంటనే యాజమాన్యం చెల్లించాలన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న కార్మికుడి కుటుంబాన్ని సంగారెడ్డి పరామర్శించారు. పరిశ్రమ లాకౌట్ చేయడంతో రైతులు, కార్మికులకు తీవ్ర నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడారు. పరిశ్రమను లాకౌట్ చేసి పనిచేస్తున్న కార్మికులను చంపుతారా అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ జీఎంతో ఫోన్ లో మాట్లాడితే సోమ, లేదా మంగళవారం లాకౌట్ ఎత్తివేయాలని ఆదేశాలు రానున్నట్లు చెప్పినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తికి రూ.5 లక్షల రూపాయలు చెల్లించాలి డిమాండ్ చేశారు.15 రోజుల్లో పరిశ్రమను సందర్శించి యాజమాన్యంతో మాట్లాడి కార్మికుల సమస్యకు పరిష్కారానికి కృషి చేస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. కార్మికుల కుటుంబానికి ఆర్థిక సాయం అందించి, మృత దేహాన్ని సొంత గ్రామం చేర్పించేలా జగ్గారెడ్డి ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క కార్మికుడు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రత్యేకంగా విజ్ణప్తి చేశారు.సమస్య పరిష్కారానికి అన్వేషించాలని కానీ తొందరపడి ఆత్మవంటి సొంత నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.L

Tags:    

Similar News