MP : జాతీయ జెండాను గౌరవించని వాళ్ళు దేశంలో ఉండటం అవసరమా..?

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-12 09:31 GMT
MP : జాతీయ జెండాను గౌరవించని వాళ్ళు దేశంలో ఉండటం అవసరమా..?
  • whatsapp icon

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏ దుర్మార్గుడు అయితే జాతీయ జెండా ఎగుర వేయని, పాలస్తీనా జిందాబాద్ అని పార్లమెంట్ లో నినాదాలు చేశాడో అలాంటి వాళ్ళని ఈ దేశంలో పోటీ చేయకుండా ఉండేందుకు చట్టం తేవాలని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాను చేత పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాల పూర్తి అవుతున్న సందర్భంగా ప్రతి వ్యక్తి తన ఇంటి పై జాతీయ జెండా ఎగుర వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని తెలిపారు. ఈ దేశంలో కొంతమంది తాము జాతీయ జెండా ఎగురవేయమని, జాతీయ గీతం పాడమని అంటున్న వారు మన దేశంలో ఉండడం అవసరమా ఆలోచించాలన్నారు.

బంగ్లాదేశ్ లో విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తే ఆ దేశ ప్రధాని దేశం విడిచి భారతదేశాన్ని శరణు గోరే పరిస్థితి వచ్చిందన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు జాతీయ జెండా వారి ఇంటిపై ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మన దేశ గౌరవాన్ని కాపాడని వాళ్ళు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు చట్టం చేసేందుకు ఆలోచన చేస్తున్నామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నీలం దినేష్, నాయకులు అంబటి బాలేష్ గౌడ్, రామచంద్ర రావు, రామచంద్ర రెడ్డి, విద్యాసాగర్, విభీషన్ రెడ్డి, కోడూరి నరేష్, గోనె మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.


Similar News