రైతాంగం ఆపదలో ఉంటే.. బీఆర్ఎస్ నేతల దావత్ లు : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి

రైతాంగం ఆపదలో ఉంటే.. బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావత్ చేసుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి ధ్వజమెత్తారు.

Update: 2023-04-26 13:25 GMT

దిశ, పెద్దపల్లి టౌన్ : రైతాంగం ఆపదలో ఉంటే.. బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావత్ చేసుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి ధ్వజమెత్తారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన పంటలను పరిశీలించిన గుజ్జుల రైతులకు భరోసానిచ్చారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు ప్రకృతి వైపరీత్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ నేతలు విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారని మండి పడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు పంట నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలన్నారు. నియోజకవర్గంలో దాదాపు 30వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. అధికారులు వెంటనే పంట నష్టంపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలన్నారు.

ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి అన్నదాతకు అండగా నిలవాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు కొంతం శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఠాకూర్ రాంసింగ్, నియోజకవర్గ ఇన్ చార్జి పిన్నింటి రాజు, బీజేపీ మండలాధ్యక్షుడు పర్స సమ్మయ్య, సిలివేరు ఓదెలు, జంగ చక్రధర్ రెడ్డి, అక్కేపల్లి క్రాంతి, ఫహీం, భూసనవేన శ్రీనివాస్ గౌడ్, ముస్త్యాల సంతోష్, రెవెళ్లి సందీప్, దులం సతీష్, కుమ్మరి తిరుమల్, కోదాటి వెంకటేశ్వర రావు, మల్ రెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News