దొంగతనానికి వచ్చి యజమానికి దొరికిపోయాడు
అర్ధరాత్రి వేళ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం చేయగా యజమాని రాకతో దొంగ దొరికిన సంఘటన నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
దిశ, చేగుంట : అర్ధరాత్రి వేళ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం చేయగా యజమాని రాకతో దొంగ దొరికిన సంఘటన నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నార్సింగి మండల కేంద్రానికి చెందిన శిర్ణ సంతోష్ నిజాంబాద్ లోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండగా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి వేళ వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి దొంగతనం కోసం వెళ్ళాడు. ఇదే సమయంలో ఇంటి యజమాని సంతోష్ బైక్పై ఇంటికి రాగా ఇంట్లో నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని పట్టుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళని లేపి ఇంట్లో జరిగిన దొంగతనం విషయం తెలిపాడు. నార్సింగి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్సింగ్ ఎస్ఐ అహ్మద్ మొహీనుద్దీన్ ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.