ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల నడవాలి

నారాయణఖేడ్ పట్టణంలోని మార్వాడి గల్లి పాఠశాలను గురువారం ఆకస్మికంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తనిఖీ చేశారు.

Update: 2024-03-07 15:34 GMT

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలోని మార్వాడి గల్లి పాఠశాలను గురువారం ఆకస్మికంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెంచే విధంగా చూడాలన్నారు. నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించడం లేదన్నారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరు శాతం మధ్యాహ్న భోజనం పథకం తదితర రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. విద్యార్థుల ఆదర్శ శాతాన్ని పెంచాలని ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల నడపాలని ఎమ్మెల్యే ఉపాధ్యాయులు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎంఈఓ విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News