నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కృ‌షి: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.

Update: 2023-04-01 10:12 GMT
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కృ‌షి: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
  • whatsapp icon

దిశ, మెదక్ ప్రతినిధి: నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆర్టీసీ డిపో లో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు బస్సులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యం కోసం మెదక్ ఆర్టీసీ డిపో కు మరో మూడు బస్సులు వచ్చాయని తెలిపారు.

గతంలో రెండు ఇప్పుడు మరో మూడు బస్సులు రావడంతో ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. యాదాద్రి ఆలయ దర్శనం కోసం బస్సు కావాలని అభ్యర్థించగా.. బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో నర్సాపూర్ డిపో ఏర్పాటు చేయడం తో పాటు 15 బస్సులు సీఎం కేసీఆర్ చొరవతో మంజూరయ్యాయని ఆమె తెలిపారు. పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు హల్ టిక్కెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు.

హైదరాబాద్ కు మినీ ఏసీ బస్సులు నడపాలని ప్రజల నుంచి వినతులు వస్తున్నాయని, త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. మెదక్ డిపోకు కొత్త బస్సులు ఇచ్చిన సీఎం కేసిఆర్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎం రవిచంద్ర, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు కిషోర్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ గౌడ్, గంగాధర్, భాని, దుర్గ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News