3న ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన : జిల్లా కలెక్టర్ శరత్

జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 3న టీఎన్జీ భవనంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి పథకం - తయారీ సంస్థల క్రమబద్ధీకరణ క్రింద ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు.

Update: 2023-05-01 12:47 GMT
3న ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన : జిల్లా కలెక్టర్ శరత్
  • whatsapp icon

దిశ, సంగారెడ్డి : జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 3న టీఎన్జీ భవనంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి పథకం - తయారీ సంస్థల క్రమబద్ధీకరణ క్రింద ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు. అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం, పరిశ్రమల సామర్ధ్యాభివృద్ధికి, అందుకు సాంకేతిక తోడ్పాటును అందించనున్నారు. ఆహార శుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ కు తోడ్పాటు అందించడం, సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన పథక ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం ఎదురుగా గల టీఎన్జీవో భవనంలో ఈ నెల 3న వివిధ పథకాల కింద కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం అందిస్తున్న తోడ్పాటు గురించి ఔత్సాహికులకు వివిధ శాఖల అధికారులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. అదేవిధంగా బ్యాంకుల నుంచి సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం పొందడానికి విధి, విధానాల గురించి తెలియజేస్తారని తెలిపారు. సూక్ష్మ పరిశ్రమల స్థాపన కోసం ఉపయుక్తమైన అధునాతన యంత్ర పరికరాల గురించి ఈ ప్రదర్శనలో ప్రయోగాత్మకంగా వివరిస్తారని తెలిపారు.

వ్యవసాయ ఆధారిత యూనిట్ల నెలకొల్పనకు అర్హులైన వారికి ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇట్టి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ మిషనరీ ప్రదర్శనను స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎఫ్.పీ.వోలు, కో-ఆపరేటివ్ సొసైటీలు, వ్యక్తిగత ఆసక్తి కలిగిన వారు, ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించుకున్న వారు, నిరుద్యోగ యువత, ఫుడ్ ప్రాసెసింగ్ పై ఆసక్తి కలిగి ఉన్నవారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Tags:    

Similar News