పాలిసెట్ నిర్వహణకు సర్వం సిద్ధం
రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ లోని మూడు సంవత్సరాల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుతో పాటు, వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా ప్రవేశం కోసం 17న జరిగే పాలిసెట్-2023 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త డాక్టర్. ఎం. శ్రీనివాసులు, సహయ సమన్వయకర్త జి.మల్లికార్జున్ తెలిపారు.
పరీక్షలకు హజరుకానున్న 2760 మంది విద్యార్థులు
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 కొనసాగనున్న పరీక్ష
జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఎం.శ్రీనివాసులు
దిశ, సంగారెడ్డి : రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ లోని మూడు సంవత్సరాల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుతో పాటు, వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా ప్రవేశం కోసం 17న జరిగే పాలిసెట్-2023 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త డాక్టర్. ఎం. శ్రీనివాసులు, సహయ సమన్వయకర్త జి.మల్లికార్జున్ తెలిపారు.
సోమవారం సంగారెడ్డి- ఇస్మాయిల్ ఖాన్ పేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రధానాచార్యులు కార్యాలయంలో మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,760 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని, సంగారెడ్డి పట్టణంలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగుతోందని, విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9:30 లోపు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 10:00 గంటల నుంచి అనుమతిస్తామని, 11:00 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్నారు.
డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఫోటో ప్రింట్ కాని వారు పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించుకొని ఎవరైనా గజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేసుకోవాలన్నారు. https://polycetts.nic.in నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, హెచ్.బీ పెన్సిల్, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎరేజర్ తెచ్చుకోవాలని కోరారు. సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, క్యాలిక్యులేటర్, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు పరీక్ష మధ్యలో టాయిలెట్ కు అనుమతించమని వెల్లడించారు.