జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
సంగారెడ్డి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రూపొందించిన 2024 నూతన డైరీని మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, జర్నలిస్ట్ సమస్యల పట్ల సానుకూలంగా ఉందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికు నూతన సంవత్సర డైరీని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ డైరీ లో ఎంతో విలువైన సమాచారం అందించారని, అందుకు అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టులు ప్రజోపయోగ కరమైన అంశాలపై సూచనలు, సలహాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సాయినాథ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి నాగభూషణం, అసోసియేషన్ సభ్యులు ఎర్ర వీరేందర్ గౌడ్, సునీల్, పుండరీకం, రాజేష్, ఆంజనేయులు, నర్సింహులు, బక్కప్ప, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.