బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
దిశ, చేగుంట : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కర్నాల్ పల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయం వద్ద అన్నదాన సత్ర నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అదేవిధంగా ఎస్సీ, బీసీ కమిటీ హాల్ నిర్మాణం కోసం రూ.5 లక్షల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ దూసుకెళ్తోందని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం మంత్రి హరీష్ రావు సహకారంతో కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం చేగుంట మండల కేంద్రంలో మకరాజుపేట నిర్మిస్తున్న రోడ్డును ఆయన పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ పట్నం తనీషా, కర్నాల్ పల్లి సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఇబ్రహీంపూర్ సర్పంచ్ రాములు, మక్కరాజుపేట సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, పార్టీ నాయకులు మహిపాల్ రెడ్డి, విశ్వేశ్వరరావు, బాలసాయి హరిప్రసాద్, అశోక రెడ్డి, యాదిరెడ్డి, తుమ్మ యాదగిరి, నార్సింగి మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, కర్నాల్ పల్లి ఎల్లమ్మ టెంపుల్ అధ్యక్షులు జనగామ రాములు గౌడ్, నాగలింగం, శివ, పలువురు నాయకులు పాల్గొన్నారు.