అందోలు దామోదర్ దే..!
అందోలు అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి.
దిశ, అందోల్ : అందోలు అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన దామోదర రాజనర్సింహ 28,193 ఓట్ల మేజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్రాంతి కిరణ్ పై గెలుపొందారు. పోలింగ్‌నకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఆదివారం నాడు నిర్వహించిన కౌంటింగ్‌లో 18 టేబుల్లో 21 రౌండ్లు లెక్కింపు జరిపారు. నియోజకవర్గంలో 24,9248 ఓటర్లు ఉండగా, వీరిలో 21,1364 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 1,14,147 ఓట్లను దామోదరకు రాగా, క్రాంతికిరణ్ కు 85,954 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ కు 5524 ఓట్లు, బీఎస్సీ అభ్యర్థి ముప్పారం ప్రకాశంకు 762 ఓట్లను సాధించారు. పోస్టల్ బ్యాలెట్ లోను కాంగ్రెస్ హవా కొనసాగింది.
1455 ఓట్లు పొలవ్వగా కాంగ్రెస్ కు 1043, బీఆర్ఎస్ కు 277, బీజేపీకి 62, బీఎస్పీకి 5 ఓట్లు వచ్చాయి. ఆందోల్ ఎమ్మెల్యేగా దామోదర్ రాజనర్సింహ గెలుపొందడంతో కుటుంబ సభ్యులతో కలిసి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే నియామక పత్రాన్నిజిల్లా కలెక్టర్ శరత్ సమక్షంలో ఆర్ ఓ పాండు ఆయనకు అందజేశారు. దామోదర్ విజయం సాధించినట్లు తెలుసుకొని వందలాదిగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కౌంటింగ్ కేంద్ర వద్దకు తరలివచ్చి పెద్దఎత్తున నినాదాలు చేశారు. సీడీర్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం దామోదర్ కుటుంబ సభ్యులతో కలిసి మునిపల్లి మండలం అంతారంలోని విఠలేశ్వర దేవాలయానికి చేరుకొని మొక్కును తీర్చుకున్నారు.
నాల్గవ సారి ఎమ్మెల్యేగా దామోదర్.. రాజనర్సింహ మరణానంతరం
1989లో రాజకీయ రంగప్రవేశం చేసిన దామోదర్ రాజనర్సింహ టీడీపీ అభ్యర్థి మాల్యల రాజయ్య పై 3014 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 1994, 1998, 1999 వరుసగా మూడు ఓటమి చెందారు. 2004 లో 24,846 ఓట్ల మెజార్టీతో, 2009లో 2906 ఓట్ల మెజార్టీతో బాబుమోహన్ పై దామోదర్ విజయాన్ని సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చెందగా, 2023లో భారీ మెజారిటీతో గెలుపొందారు.