ఆందోలులో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ గెలుపు..
అసెంబ్లీ ఎన్నికలలో ఆందోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దామోదర్ రాజనర్సింహ, అధికార పార్టీ నుండి చంటి క్రాంతి కిరణ్ బీజేపీ పార్టీ, బాబు మోహన్ బరిలో నిలిచారు.
దిశ, అల్లాదుర్గం : అసెంబ్లీ ఎన్నికలలో ఆందోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దామోదర్ రాజనర్సింహ, అధికార పార్టీ నుండి చంటి క్రాంతి కిరణ్ బీజేపీ పార్టీ, బాబు మోహన్ బరిలో నిలిచారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో అధికార పార్టీ చంటి క్రాంతి కిరణ్ , కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనర్సింహ కు హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో దామోదర్ రాజనర్సింహ 28,466 మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం వ్యాప్తంగా పలుగ్రామాలలోని పలు వీధుల గుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టి డప్పువాయిద్యాలు, డీజే పాటలతో, టపాకాయలు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఆందోల్ నియోజకవర్గం ప్రజల చిరకాల కోరికలు తీరనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.