పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన చిట్టీల వ్యాపారి

ప్రజలను నమ్మించి అధిక వడ్డీలు ఇస్తాను అంటూ కోట్లలో వసూలు చేసి భార్య పిల్లలతో బిజిలి పురం యాదగిరి పారిపోయాడు.

Update: 2024-03-08 14:29 GMT

దిశ, తూప్రాన్: ప్రజలను నమ్మించి అధిక వడ్డీలు ఇస్తాను అంటూ కోట్లలో వసూలు చేసి భార్య పిల్లలతో బిజిలి పురం యాదగిరి పారిపోయాడు. దీంతో మంగళవారం మిస్సింగ్ కేసుతో చిట్టీల వ్యాపారి కోట్లలో మోసం చేసి పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కి వెళ్ళారు. పారిపోయిన చిట్టీల వ్యాపారి శుక్రవారం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని పోలీసులు అతన్ని విచారిస్తున్నారని తెలుసుకున్న బాధితులు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్‌కి బాండు పేపర్లలో తరలి వెళ్ళి వెళ్లారు. న్యాయం చేసే వరకు ఇక్కడే ఉంటామని ఆందోళనకు దిగారు. ఎంత మొత్తంలో మోసం జరిగింది అనేది దర్యాప్తు తర్వాత తెలుస్తుందని పోలీసులు తెలిపారు.


Similar News