నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసిన చింతా ప్రభాకర్

సంగారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గురువారం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయాన్ని సందర్శించారు.

Update: 2023-11-09 07:57 GMT

దిశ, సదాశివపేట : సంగారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గురువారం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యవారిది, సదాశివపేట పట్టణంలో గల అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మణికంఠుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తన నివాసానికి వచ్చి అక్కడ తన మాతృమూర్తికి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసే తత్వం తనలో లేదని, తాను.. ధర్మ బద్ధమైన పాలన కోసం పోరాడేవాన్ని అని, ఈ విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు అన్నారు. తాము తన సిద్ధాంతాన్ని వదిలిపెట్టేదే లేదని , పూటకోమాట, రోజుకో వేషం వేసే విధానం తనది కాదని మరోసారి స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారికి ప్రజాసంక్షేమంలో న్యాయం జరిగేలా వారి కోసం పోరాడేది తానే అని, అది ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు.

గులాబీ జెండా సంగారెడ్డి నియోజకవర్గంలో అంతటా రెపరెపలాడుతుందని చెప్పారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి ప్రజలు తనకు అప్పగించకున్నా ప్రజలకు శిరస్సు వంచి ప్రజాసేవ చేశానని.. తెలంగాణలోని సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని తారాస్థాయికి తీసుకెళ్లాలని గుర్తు చేశారు. ప్రజలు ఐదేళ్ల పాటు ప్రజాక్షేత్రంలో నేను చేసిన సేవకు ప్రస్తుతం ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. భగవంతుని దీవెనలతో ప్రజా ఆశీర్వాదంతో.. ఈ సారి తాను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తున్నానని నిండు మనసుతో నామినేషన్ వేస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని పరుగులెత్తిస్తున్న కార్యకర్తలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ వాతావరణం నవంబర్ 30 వరకు రెట్టింపు అవుతుందని, ప్రతిపక్ష పార్టీలు కోలుకోకుండా సంగారెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు సంచలమైన భారీ విజయాన్ని కేసీఆర్ కు అందిస్తారని చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం, స్వగృహంలో తన మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకొని.. తమ్ముడు చింతా గోపాల్, తనయుడు చింతా సాయినాథ్, కుటుంబ సభ్యులతో సాదాసీదాగా నామినేషన్ కు బయలుదేరినారు.

Tags:    

Similar News