ప్రశాంతంగా పాలిసెట్

పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2023 పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది.

Update: 2023-05-17 11:08 GMT
ప్రశాంతంగా పాలిసెట్
  • whatsapp icon

2,924 మందికి గాను విద్యార్థులకు 2,820 హాజరు, 104 మంది గైర్హాజరు

నిమిషం నిబంధనతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2023 పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎనమిది పరీక్షా కేంద్రాల్లో 2,924 మంది విద్యార్థులకు 2,820 మంది విద్యార్థులు హాజరు కాగా 104 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో (పెద్ద కోడూర్) 268 మంది విద్యార్థులకు ఆరుగురు గైర్హాజరయ్యారు.

ఎస్.ఆర్.కే డిగ్రీ కళాశాలలో 300 మంది విద్యార్థులకు 14 మంది గైర్హాజరయ్యారు. బీఎంఆర్ డిగ్రీ కళాశాలలో 500 మంది విద్యార్థులకు 22 మంది గైర్హాజరయ్యారు. ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో 380 మంది విద్యార్థులకు 13 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏ-సెంటర్ లో 500 మందికి 18, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీ-సెంటర్ లో 500 మందికి 12 మంది, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 200 విద్యార్థులకు 10 మంది, ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో 275 మందికి తొమ్మిది మంది గైర్హాజరైనట్లు పాలిసెట్ జిల్లా కో-ఆర్డినేటర్ జీ.సూర్యనారయణ తెలిపారు. పాలిసెట్ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30వరకు జరగగా.. పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులకు ఉదయం 10 నుంచే అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందూరు కళాశాలలో ఓ విద్యార్థి ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించ లేదు.

Tags:    

Similar News