చంద్ర శేఖర్ ఆచార్యకు రాష్ట్ర ఉత్తమ రక్తదాత పురస్కారం..
నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నిరంతర సామాజిక సేవకులు, చంద్ర శేఖర్ ఆచార్య 52 సార్లు రక్తదానంతో పాటు కరోనా వ్యాధితో బాధపడుతున్నవారికి సకాలంలో స్పందించి ప్లాస్మాను అందచేయడం అభినందనీయమని
దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నిరంతర సామాజిక సేవకులు, చంద్ర శేఖర్ ఆచార్య 52 సార్లు రక్తదానంతో పాటు కరోనా వ్యాధితో బాధపడుతున్నవారికి సకాలంలో స్పందించి ప్లాస్మాను అందచేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాదులోని రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్ర శేఖర్ ఆచార్యకు రాష్ట్ర స్థాయి ఉత్తమ రక్తదాత పురస్కారంను రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వివిధ చికిత్సలు పొందుతున్న రోగులకు రక్తం అవసరం ఏర్పడుతుందని అందుకోసం సమాజం పట్ల బాధ్యత గల సామాజిక సేవా కార్యకర్తలు నిరంతరము రక్తదాన శిబిరాలు పెట్టడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు , చంద్రశేఖర్ ఆచార్యను సభకు పరిచయం చేస్తూ గత 25 సంవత్సరాలుగా 52సార్లు రక్తదానం చేయడం వల్ల అనేకమంది రోగులకు ప్రాణదానం కలిగిందన్నారు. పదుల సంఖ్యలో రక్తదాన శిబిరాలు నిర్వహించి వేలాది మందితో రక్తదానం చేయించారని తెలిపారు.
అదేవిధంగా మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దానం చేస్తూ అంగీకార పత్రాన్ని అందజేయడంతో పాటు వివిధ పాఠశాలలో అవయవ దానం గురించి అవగాహన సదస్సులు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ శాసనసభ్యులు కే.సత్యనారాయణ, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ .వి. కర్ణన్, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేషం, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, రెడ్ క్రాస్ సొసైటీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ వనజ రెడ్డి, కార్యదర్శి చందర్ పాలుగోన్నారు. చంద్ర శేఖర్ ఆచార్యకు రాష్ట్ర ఉత్తమ రక్తదాత పురస్కారాన్ని అందజేయడం పట్ల లయన్స్ క్లబ్ బాద్యులు , వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయలు, వారి పూర్వ విద్యార్థులు అభినందనలు తెలిపారు.