పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

గ్రామ శివారులో రాత్రి సమయంలో ముంజ రాజేందర్ షెడ్డులో పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులు కలిసి రైడ్ చేశారు.

Update: 2024-09-05 04:21 GMT
పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురిని  అరెస్టు చేసిన పోలీసులు
  • whatsapp icon

దిశ కోహెడ : గ్రామ శివారులో రాత్రి సమయంలో ముంజ రాజేందర్ షెడ్డులో పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులు కలిసి రైడ్ చేశారు. 12 మంది వ్యక్తులు కలిసి పేకాడుతున్నారు. అందులో ఏడుగురు వ్యక్తులు పారిపోగా, మిగిలిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 15,100 వేలు 5 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడిన వారిలో దాన బోయిన కృష్ణ స్వామి, ముంజ రమేష్, కంది సత్యనారాయణ రెడ్డి, మేడ బోయిన సురేష్, సుకుమార్ రావు, అఖిల్ రెడ్డి, నాగరాజు, చిట్టి యాదగిరి, యధా అశోక్, వేణు, గొట్టం తిరుపతి రెడ్డి, ముంజ సంపత్ ఉన్నారు. కాగా అందరూ కోహెడ గ్రామస్తులే ఉండటం విశేషం. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్‌లలో, ఇళ్ళల్లో బహిరంగంగా పేకాట ఆడుతున్నట్లు, మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.


Similar News