నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన, ప్రణాళికతో నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.
దిశ , సంగారెడ్డి: ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన, ప్రణాళికతో నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో 5 నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులతో నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు, నిబంధనలు తదితరాలపై చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ వాటి పరిశీలన నామినేషన్ల ఉపసంహరణ లాంటి అంశాలు చాలా కీలకమైనవని, వాటిని క్షుణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం చేయవలసిన పనులు ముందస్తు ప్రణాళికతో పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు.
నామినేషన్ స్వీకరన ఉదయం 11:00 గం.ల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు ఉంటుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మొత్తాన్ని విడియో రికార్ట చేయాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్,మాధురి డీఆర్ఓ నగేష్, ఐదు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఏఓ పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.