అంగన్వాడీ కేంద్రాల్లో పెట్టాల్సింది సీసీ కెమెరాలు కాదు పౌష్టికాహారం

అంగన్వాడీ కేంద్రాల్లో పెట్టవలసింది సీసీ కెమెరాలు కాదని పౌష్టికాహారం అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి అన్నారు.

Update: 2024-03-06 14:37 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: అంగన్వాడీ కేంద్రాల్లో పెట్టవలసింది సీసీ కెమెరాలు కాదని పౌష్టికాహారం అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అనడం సబబు కాదన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్ వాడి కేంద్రాలకు అద్దె బిల్లులు సకాలంలో చెల్లించాలన్నారు. సెక్టార్, ప్రాజెక్టు సమావేశాలతో పాటు, ప్రభుత్వ కార్యకలాపాలకు హాజరు కావడంతో అంగన్వాడీల పై పనిభారం పెరిగిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలల్లో సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యుడు కనకయ్య, వెంకటయ్య, బాల నర్సయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News