పదిలో మంచి ఫలితాలే లక్ష్యంగా చదవాలి

విద్యార్థులు భవిష్యత్తు పై మంచి ప్రేరణ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు సూచించారు.

Update: 2024-02-02 14:00 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: విద్యార్థులు భవిష్యత్తు పై మంచి ప్రేరణ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు సూచించారు. మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్‌లో ,శుక్రవారం 10వ తరగతి SC, STహాస్టల్ విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ మెదక్ ఆధ్వర్యంలో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరైన, ప్రేరణ తరగతులను అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ… 10 వ తరగతిలో విద్యార్థులు మంచి జీవితం కోసం ప్రేరణ కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, అనుభవమైన ఉపాద్యాయులతో పాటు అన్ని రకాల పుస్తకాలు , స్నాక్స్ ఆల్ ఇన్ వన్ లాంటి స్టడీ మెటీరియల్స్‌ను, విద్యార్థులకు క్రమం తప్పకుండా అందిస్తున్నామన్నారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థుల కోసం, ప్రత్యేక స్టడీ హావర్స్ ,ప్రత్యేక టుటర్స్‌లను నియమించి అనుభవం గల నిపుణులతో ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జీవితంలో మంచి భవిష్యత్‌కు పదవ తరగతి కీలకం అన్నారు.

పదవతరగతి లో ఉన్న సబ్జెక్ట్‌లను నిర్లక్ష్యం చేయొద్దని, పదవ తరగతి సబ్జెక్ట్ ‌ కేంద్ర ,రాష్ట్ర స్థాయిలో ఉండే సివిల్స్, గ్రూప్ 1, 2, 3 లాంటి పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. పరీక్షలకు కొన్ని రోజులే సమయం ఉన్నందున సమయాన్ని వృథా చేయవద్దన్నారు. టీవీ, ఫోన్, ,సోషల్ మీడియాలో లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. గ్రూప్‌ల విద్యార్థులను విభజించాలమని , వెనక బడిన గ్రూపు విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పదో తరగతి విద్యార్థులు సమన్వయంతో చదువు కోవాలన్నారు. హాస్టల్‌లో విద్యార్థులను హాస్టల్ వార్డెన్‌లు ,ఉదయం నిద్ర లేపి చదివించాలని, పరీక్షల సమయంలో విద్యార్థులను క్రమశిక్షణ గా ఉండేలా వార్డెన్‌లు బాధ్యత తీసుకోవాలన్నారు. 10వ తరగతిలో పది శాతం ఫలితాల లక్ష్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పని చేయాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ అభివృద్ది అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ… మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లలో 260 మంది విద్యార్థులు ఈ సం.రానికి పదవ తరగతి లో పరీక్షలకు సిద్దంగా ఉన్నారని, విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌లలో మంచి మార్కులు వచ్చేలా విషయ నిపుణులతో ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఉదయం, సాయంత్రం స్నాక్ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయ లక్ష్మి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా కార్యదర్శి రవికుమార్, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు, హాస్టల్ వార్డెన్‌లు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read More..

జీఓ 55 రద్దు చేయాలని నిరసన 

Tags:    

Similar News