అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని చౌడమ్మ గుట్టలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. జడ్చర్ల మున్సిపాలిటీలోని క్లబ్ రోడ్ సమీపంలో గల చౌడమ్మ గుట్టలో నిర్మానుశ్య ప్రాంతంలో
దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని చౌడమ్మ గుట్టలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. జడ్చర్ల మున్సిపాలిటీలోని క్లబ్ రోడ్ సమీపంలో గల చౌడమ్మ గుట్టలో నిర్మానుశ్య ప్రాంతంలో సుమారు 30-35 సంవత్సరాలు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కూల్లిన స్థితిలో పడి ఉంది. అటుగా వెళ్లిన కొందరికి కనబడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహం పడి ఉన్న తీరును చూస్తే యువకుడిని ఎవరో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పట్టణ ప్రజల పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టి మృతుడి వివరాలు తెలిస్తే వ్యక్తి మృతికి గల కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.